Share News

నేటి రాశి ఫలాలు... 8-10-026

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:12 AM

నేటి రాశి ఫలాలు... గురువారం 8-10-2026

నేటి రాశి ఫలాలు... 8-10-026

నేటి రాశి ఫలాలు... గురువారం 8-10-2026

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు భాగస్వామి సహకారం లభిస్తుంది. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 22 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆడిటింగ్‌, ప్రకటనలు, విద్య, క్రీడల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రిజిస్ట్రేషన్లు, ఆస్తి పత్రాల రాతకోతలకు అనుకూలం. విద్యార్థులకు వసతి లభిస్తుంది.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాలకు చెందిన విషయాల్లో చర్చలు ఫలిస్తాయి. అగ్రిమెంట్ల, డాక్యుమెంటేషన్లకు అనుకూలం. కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, మెసేజ్‌లు ఆనందం కలిగిస్తాయి.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 23-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. కొత్త పనుల ప్రారంభానికి అవసరమైన నిధులు సమకూర్చకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి లాభాలు అందుకుంటారు.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికి వస్తారు. టెలివిజన్‌, ప్రచురణలు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్‌, ఆభరణాల రంగాల వారు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడతారు. ఒత్తిడి నుంచి బయటపడి ఊరట పొందుతారు.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. సమావేశాల్లో మీ పంతం నెగ్గించుకుంటారు.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అనుకూలం. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక విషయాల్లో పెద్దల సహ కారం లభిస్తుంది.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రచురణలు, టెలివిజన్‌, రవాణా, బోధన, న్యాయ రంగాల వారు గౌరవ, మర్యాదలు అందుకుంటారు. చర్చల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడుల్లో ప్రణాళిక ప్రకారం నడుచుకుని మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వేడుకలు, సమావేశాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 08 , 2026 | 01:34 AM