Share News

నేటి రాశి ఫలాలు... 7-10-026

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:20 AM

నేటి రాశి ఫలాలు... బుధవారం 7-10-2026

నేటి రాశి ఫలాలు... 7-10-026

నేటి రాశి ఫలాలు... బుధవారం 7-10-2026

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులు అధికం. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.


02 VRUSHABHAM.jpg

వృషభం (ఏప్రిల్‌ 22 - మే 20 మధ్య జన్మించిన వారు)

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహపడతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్‌, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. మార్పులకు అనుకూలమైన రోజు.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)

స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చల్లో నిదానం పాటించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. రవాణా, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. బంధుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరమైన చర్చలకు అనుకూలం. తోబుట్టవులు, బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 23-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక సంస్థలతో పనులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేడుకలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. సినీ, రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వేడుకలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెడతారు.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలకు ఖర్చులు అధికం. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారు వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఎదుర్కుంటారు. పెద్దలను స్మరించుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. దానధర్మాలు చేస్తారు. వైద్య సేవల కోసం అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. బృందకార్యక్రమాలు, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 07 , 2026 | 01:45 AM