నేటి రాశి ఫలాలు.. 30-10-2026
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:39 AM
నేటి రాశి ఫలాలు శుక్రవారం (30-10-2026)
నేటి రాశి ఫలాలు శుక్రవారం (30-10-2026)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. రుణాలు మంజూరవుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.

వృషభం ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వివాహ నిర్ణయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. తోబుట్టువుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. రవాణా, బోధన, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వైద్య, పరిశ్రమలు, వ్యవసాయం, హోటల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సృజనాత్మకంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. క్రీడలు, ఆడిటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్స్, విద్యారంగాల వారు కొత్త మార్గాన్ని అనుసరించి విజయం సాధిస్తారు. పొదుపు పథకాలు లాభిస్తాయి.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సినీ రాజకీయ రంగాల వారు తమ పరిస్థితిని సమీక్షించుకునేందుకు తగిన సమయం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. బృందకార్యక్రమాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఇంక్రిమెంట్లు, బోనస్‌లు చేతికి అందుతాయి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కళలు, న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ఒక శుభవార్త అందుకుంటారు.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గతంలో చేసిన శ్రమకు ప్రతిఫలం అందుకుంటారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. సంకల్పం ఫలిస్తుంది.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్ రంగాల వారు పలుకుబడి ఉన్న వ్యక్తుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, ప్రచురణలు, ఆడిటింగ్, కళా రంగాల వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రియతములతో సంభాషణలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ