Share News

నేటి రాశి ఫలాలు.. 27-10-2026

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:45 AM

నేటి రాశి ఫలాలు మంగళవారం (27-10-2026)

నేటి రాశి ఫలాలు..  27-10-2026

నేటి రాశి ఫలాలు మంగళవారం (27-10-2026)

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో అవసరమైన నిధులు సర్దుబాటవుతాయు. పెన్షన్‌, బీమా, మెడికల్‌ క్లెయిములు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి విషయంలో శుభపరిణామాలు సంభవం. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్‌, సేవల రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతారు.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక సంస్థలు, యూనియన్‌ వ్యవహారాల్లో పాల్గొంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బ్యాంకులు, ఫైనాన్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, వృత్తిపరమైన మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్య సాధనలో పెద్దల సహకారం అందుతుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శుభప్రదం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్యం, సేవల రంగాల వారికి అనుకూలం. బీమా, పెన్షన్‌, డిపాజిట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

స్పెక్యులేషన్లు లాభిస్తాయి. షాపింగ్‌, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్‌ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

స్నేహాలు, అనుబంధాలు బలపడతాయి. సినిమాలు, టెలివిజన్‌, కళలు, క్రీడల రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. చిన్నారులకు సంబంధించిన ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు పలుకుబడిగల వ్యక్తుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఉన్నత పదవులు అందుకుంటారు. బదిలీలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు తగిన సమయం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కమ్యూనికేషన్‌ రంగాల వారికి ప్రోత్సాహ కరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అగ్రిమెంట్లు, రాతకోతలకు అనుకూలం. మెయిల్స్‌, సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. తోబుట్టువుల విషయాల్లో శుభపరిణామలు చోటుచేసుకుంటాయి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 27 , 2026 | 04:52 AM