నేటి రాశి ఫలాలు... 25-09-026
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:53 AM
నేటి రాశి ఫలాలు... శుక్రవారం 25-09-2026
నేటి రాశి ఫలాలు... శుక్రవారం 25-09-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
భాగస్వామికి సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. ప్రయణాలు, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. ఒక రహస్య సమాచారం తెలుసుకుంటారు. పందాలు, పోటీలకు దూరంగా ఉండటం మేలు. దుర్గామాత ఆలయ దర్శనం శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21-మే 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో సన్నిహితుల నుంచి మాటపడాల్సి వస్తుంది. విందు వినోదాలకు ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశ ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం ( మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పిల్లల వైఖరి కారణంగా తల్లిదండ్రులకు ఆవేదన కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించ కపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. గౌరవ మర్యాలదలకు భంగం కలిగే అవకాశం ఉంది. మహా లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం( జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
దూరంలో ఉన్న బందుమిత్రులకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. వేడుకలు, సమావేశాల ఏర్పాట్లలో అసౌకర్యం కలుగుతుంది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం అవసరం. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.

సింహం (జూలై24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. రుణ ప్రయత్నాలు పలిస్తాయి. వైద్య సేవలకు ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గోమాత ఆరాధన శుభప్రదం.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో నిదానం అవసరం. అమ్మవారి దర్శనం శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. విందు వినోదాల్లో ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చేపించాలి. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సన్నిహితులకు సంబంధించిన ఒక సమాచారం కలవరపెడుతుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సినిమా, టెలివిజన్ క్రీడలు, పాఠశాలల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. వేడుకల్లో ఖర్చులు అధికం. శ్రీ కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెద్దలతో చర్చల సందర్భంలో నిదానం పాటించండి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీ అంచనాలు ఫలించకపోవచ్చు. పెట్టుబడులుకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. సమావేశాలు, వేడుకలకు ఖర్చులు అధికం. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20- మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. లలితా పరమేశ్వరి ఆరాధన శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ