నేటి రాశి ఫలాలు.. 24-10-2026
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:51 AM
నేటి రాశి ఫలాలు.. 24-10-2026Today Horoscope.. 24-10-2026
నేటి రాశి ఫలాలు శనివారం (24-10-2026)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. రుణాలు మంజూరవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరమ్మతులకు ఖర్చు చేస్తారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు.

వృషభం (ఏప్రిల్ 21-మే 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. భాగస్వామికి సంబంధించిన కీలక సమాచారం తెలుసుకుంటారు. ఆటంకాలు ఎదురైనా భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూరంప్రాంతంలో ఉన్న వ్యక్తులతో అనుబంధాలు పెరుగుతాయి.
మిథునం ( మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వృత్తిపరమైన సమావేశాలు లాభిస్తాయి. ఆర్థిక విషమాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం( జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పైఅధికారుల వైఖరి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం (జూలై24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆడిటింగ్, న్యాయ, బోదన, రవాణా, ప్రచురణ రంగాల వారు తమ పనితీరును సమీక్షించుకుంటారు. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు సేకరిస్తారు. లక్ష్యాలు సాధిస్తారు.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
రుణాలు, పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలమైన రోజు. పాతబకాయిలు వసూలవుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ఆస్పత్రులు, హార్డ్‌వేర్, ఫైనాన్స్, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం. వైద్యం, పరిశ్రమలు, హోటల్, వ్యవసాయం రంగాల వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రియతమలు నుంచి మంచి సమాచారం అందుతుంది. సినిమాలు, టెలివిజన్, పత్రికల రంగాల వారికి ప్రోత్సాహకరం.
మకరం (డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిదులు సర్దుబాటు అవుతాయి
కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు. విద్యార్థులకు పెద్దల నుంచి ప్రోత్సహం లభిస్తుంది. స్టేషనరీ, బోధన, వాహన రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీనం (ఫిబ్రవరి 20- మార్చి 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చర్చలు, వ్యూహాలు ఫలిస్తాయి. విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ప్రచురణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ