నేటి రాశిఫలాలు.. 21-11-2026
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:37 AM
నేటి రాశి ఫలాలు.. శనివారం 21-11-2026
నేటి రాశి ఫలాలు.. శనివారం 21-11-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో కొత్త వ్యూహాలు,. ఆలోచనల అమలును ఈ రోజుకు వాయిదా వేయడం మేలు రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. న్యాయ వివాదాలు చికాకు కలిగిస్తాయి. దూరంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ఊరటనిస్తాయి. దుర్గామాత ఆరాధన శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. వైద్యం, పరిశ్రమలు, ఆర్థిక సంస్థల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో నిరాశ ఎదురవుతుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడంతో నిరాశ పడతారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. టెలివిజన్, క్రీడలు, పాఠశాల రంగాల వారికి ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదరయ్యే అవకాశం ఉంది. న్యాయ, బోధన, రవాణా, రక్షణ రంగాల వారికి మనశ్శాంతి లోపిస్తుంది. గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరమైన చర్చలు, పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలకు అనుకూలం. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో నష్టం కలిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 23-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, క్రీడలు, నటన, ఆడిటింగ్, విద్యారంగాల వారు ఆశించిన ఫలితాలు అందుకోవడం కష్ట సాధ్యం. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరిస్తే లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సకాలంలో అందక పోవచ్చు. వేడుకలకు ఏర్పాట్లలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించేందుకు అధికంగా శ్రమించాలి. పెద్దలతో చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రక్షణ, బోధన, న్యాయ, రవాణా, ప్రచురణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. వేడుకలకు ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. పారితోషికాలు అందుకుంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ