నేటి రాశి ఫలాలు... 20-10-026
ABN , Publish Date - Oct 20 , 2026 | 02:20 AM
నేటి రాశి ఫలాలు మంగళవారం 20-10-2026
నేటి రాశి ఫలాలు మంగళవారం 20-10-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విజయలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21-మే 20 మధ్య జన్మించిన వారు)
కొత్త వ్యాపారాల ప్రారంభానికి అనుకూలం. లక్ష్య సాధనలో పెద్దలు, ప్రముఖుల సహకారం లభిస్తుంది. విందు వినోదాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నారులు, ప్రియతమలు కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సకాలంలో నిధులు సర్దుబాటు అవుతాయి. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇల్లు, స్థలసేకరణకు అవసరమైన నిధుల గురించి ఆలోచిస్తారు. లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వాట్సప్ సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. లలితాదేవిని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఇంక్రిమెంట్లు, బోనస్‌లు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతములతో ఆనందంగా గడుపుతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లలితాదేవిని ఆరాధించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
దూరంలో ఉన్న బంధుమిత్రుల రాక తో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారసత్వ విషయాలు చర్చకు వస్తాయి. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఫలిస్తాయి. లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు
తోబుట్టవులు, మిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరమైన చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. విజయదుర్గా మాత ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పాల్గొంటారు. పెద్దలు, పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. లలితా దేవిని ఆరాధించండి.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, ఉత్సవాల్లో బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. దూర ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొంటారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. విరాళాలు, దానధర్మాలు సాంత్వన కలిగిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ లలితా సహస్ర నామపారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ