నేటి రాశిఫలాలు.. 20-11-2026
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:51 AM
నేటి రాశి ఫలాలు.. శుక్రవారం 20-11-2026
నేటి రాశి ఫలాలు.. శుక్రవారం 20-11-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహరాలకు అవసరమైన నిదులు సర్దుబాటు అవుతాయి. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. శుభవార్త అందుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలమైన రోజు. గతాన్ని సమీక్షించుకుని మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం (ఏప్రిల్ 21-మే 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆర్థికపరమైన లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. భాగస్వామ్యాలు లాభిస్తాయి.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపార రంగాల వారు కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. పది మందిలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. వారితో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, టీచింగ్, ప్రచురణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.

సింహం (జూలై 23-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బోనస్లు అందుకుంటారు. బీమా, పెన్షన్ గ్రాట్యుటీ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం ఫలిస్తుంది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వివాహ నిర్ణయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. వేడుకలు, బృంద కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నూతన భాగస్వామ్యాల వల్ల ప్రయోజనం పొందుతారు. శుభవార్త అందుకుంటారు.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వైద్యం, హోటల్, ఫార్మా, కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి.

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సృజనాత్మకరంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. బదిలీలు, మార్పుల విషయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బోధన, రవాణా, కమ్యూనికేషన్లు, స్టేషనరీ, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లపై ఒక అవగాహనకు వస్తారు. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం. వేడుకలకు ఏర్పాట్లపై దృష్టి సారిస్తారు. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. లక్ష్యాలు సాధిస్తారు.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ