నేటి రాశి ఫలాలు... 14-10-026
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:35 AM
నేటి రాశి ఫలాలు బుధవారం 14-10-2026
నేటి రాశి ఫలాలు బుధవారం 14-10-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మహాగణపతిని ఆరాధించండి.

వృషభం (ఏప్రిల్ 21-మే 20 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నాణ్యతలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత నష్టపోతారు. భాగస్వామి ఆరోగ్యం కలవరపెడుతుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం

మిథునం (మే 21- జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాట పెడతారు. శ్రీ రామచంద్రమూర్తి ఆరాధన శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, విద్య, ఆడిటింగ్, క్రీడల రంగాల వారికి శుభప్రదం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. ప్రియతముల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24- ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్, విద్య, కాస్మొటిక్ వ్యాపార రంగాల వారికి లక్ష్య సాధనలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. మహాగణపతిని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అధికం. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను సమీక్షించుకుంటారు. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చులు అధికం. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
గతంలో జరిగిన విషయాలు గుర్తుకు వచ్చి మానసిక ఆందోళనకు లోనవుతాయి. కష్టంలో ఉన్న వారిని పరామర్శిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. మహాగణపతిని ఆరాధించండి.

ధనుస్పు (నవంబరు 23-డిసెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సిం వస్తుంది. వైఫల్యాలపై సమీక్షించుకునేందుకు ఇది సరైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు. శ్రీ రామచంద్రమూర్తిని ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పెద్దలతో చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. ఆర్థిక వ్యవహారాల్లో పెద్దలు, నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. విద్య, ప్రచురణలు, టెలివిజన్, రక్షణ, న్యాయ రంగాల వారు ఆర్థిక విషయాల్లో కొంత నిదానం పాటించాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ