నేటి రాశి ఫలాలు... 1-11-2026
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:15 AM
నేటి రాశి ఫలాలు ఆదివారం 1-11-2026
నేటి రాశి ఫలాలు ఆదివారం (1-11-2026)

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఫీజులు, బకాయిలు చెల్లిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. టెలివిజన్, క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం (ఏప్రిల్ 21- మే 20 మధ్య జన్మించిన వారు)
గృహారంభ ప్రవేశాలకు అనుకూలం. బంధుమిత్రుల కలయిక తో ఇల్లు సందడిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి కొత్త పరిచయాల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. వ్యవసాయం, పరిశ్రమలు, ఫార్మా రంగాల వారు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. స్నేహితులు, తోబుట్టువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
గృహారంభ, ప్రవేశాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ఇల్లు, స్థిరాస్తి విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. లక్ష్యాలు సాధిస్తారు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
దూరంలో ఉన్న బంధుమిత్రుల నుంచి శుభవార్త అందుకుంటారు. చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు తమ పురోగతిని సమీక్షించుకుంటారు. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. సన్నిహితులో విహార యాత్రలు ఆనందం కలిగిస్తాయి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. బృందకార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.

వృశ్చికం (అక్టోబరు 24- నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పదిమందిలో మంచి పేరు తెచ్చుకుంటారు. తల్లిదండ్రుల విషయాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన సమయం.

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 22 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో సమావేశాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాల్సిన సమయం. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం (డిసెంబరు 23-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది.

కుంభం ( జనవరి 21- ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వివాహ నిర్ణయాల్లో పెద్దల సహకారం అందుకుంటారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయ విషయాలకు సంబంధించిన పెద్దల సలహాలు తీసుకుంటారు.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలాలు అందుకుంటారు. పారితోషికాలు లభిస్తాయి. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ