నేటి రాశి ఫలాలు... 11-10-026
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:18 AM
నేటి రాశిఫలాలు ఆదివారం 11-10-2026
నేటి రాశిఫలాలు ఆదివారం 11-10-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. కొంత పరిచయాలు లాభిస్తాయి. సమావేశాలు, వేడుకల్లో కీలక పాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. గోమాత ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు సన్నిహితుల సహకారంలభిస్తుంది. పట్టుదలతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలు లాభిస్తాయి. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. బదిలీలు, మార్పులకు అనుకూలమైన సమయం. తల్లిదండ్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
చర్చలు, ప్రయాణాలకు అనుకూలమైన రోజు, వాహనం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దుర్గామాతను ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ చూపుతారు. కొంతకాలంగా ఉన్న ప్రతికూల వాతావరణం తొలగిపోయి ఉత్సాహం నెలకొంటుంది. సంకల్ప సాధన దిశగా అడుగులు వేస్తారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లలితా పరమేశ్వరిని ఆరాధించండి.

ధనుస్సు (నవంబరు 23 -డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థికపరమైన సమావేశాలు లాభిస్తాయి. బందుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం.

మకరం (డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రమోషన్లు, అందుకుంటారు. అదనపు ఆదాయం లభిస్తుంది. తల్లిదండ్రుల విషయాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రచురణలు, టెలివిజన్, రవాణా, న్యాయ, రక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. లలితా పరమేశ్వరి ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం అందుకుంటారు. పాతబకాయిలు వసూలవుతాయి. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. దుర్గామాతను ఆరాధించండి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ