నేటి రాశి ఫలాలు 11-09-2026
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:39 AM
నేటి రాశి ఫలాలు 11-09-2026
నేటి రాశి ఫలాలు 11-09-2026

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శద్ధ్ర చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. సహోద్యోగుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పట్లుదలతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. శ్ర మకు తగిన ఫలితం లభిస్తుంది. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పిల్లల వ్యవహారశైలి మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. తల్లిదండ్రుల విషయాల్లో శ్రద్ధ చూపించాలి. లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు తగిన సమయం కాదు. అన్నదమ్ముల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. ఒక సమాచారం కలవరపెడుతుంది. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంల నాణ్యత పాటించాలి. ఆర్థిక పరిస్థితి ఆవేదన కలిగిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. దుర్గామాతను ఆరాధించండి

కన్య (ఆగస్టు 24-సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో ఆశాంతి నెలకొంటుంది. వ్యక్తిగత విషయాల్లో అసౌకర్యానికి లోనవుతారు. లక్ష్య సాధనకు మరింత శ్రద్ధతో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. కొత్త ఆలోచనలు అమలుకు సమయం కాదు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
అన్ని విషయాల్లో ఆటంకాలు ఎదురుకావడంతో ఆశాంతికి లోనవుతారు. ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. ఆత్మపరిశీలనకు తగిన సమయం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు శాంతినిస్తాయి. లలితా పరమేశ్వరిని ఆరాదించండి.

వృశ్చికం (అక్టోబరు 24-నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. బృందకార్యక్రమాల్లో అనవసర బాధ్యతలు మోయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 -డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఉద్యోగ రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ చూపించాలి. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22- జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్యా విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. సమావేశాలు, చర్చల్లో నిదానం అవసరం. ఫలిస్తాయి. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. లలితా పరమేశ్వరి ఆరాధన శుభప్రదం.

కుంభం ( జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. రుణబాధలు ఇబ్బది పెడతాయి. ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ద చూపించాలి. దుర్గామాతను ఆరాధించండి.

మీనం (ఫిబ్రవరి 20-మార్చి 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నిదానం అవసరం. కొత్త పరిచయాల వల్ల నష్టం వాటిల్లుతుంది. సమావేశాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. జనసంబంధాలు విస్తరిస్తాయి. గోమాత ఆరాధన శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ