బానెట్‌పై గర్ల్‌ఫ్రెండ్.. అయినా కారు ఆపకుండా.. బాయ్‌ఫ్రెండ్ అరెస్టు
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:03 PM
యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను ఆమె బాయ్‌ఫ్రెండ్ కారుతో ఢీకొట్టి, బానెట్‌పై ఆమె ఉన్నా లెక్క చేయక వాహనాన్ని తోలాడు.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను ఆమె బాయ్‌ఫ్రెండ్ కారుతో ఢీకొట్టి, బానెట్‌పై ఆమె ఉన్నా లెక్క చేయకుండా వాహనాన్ని ప్రమాదకరంగా ముందుకు తోలాడు. ఈ ఘటనలో మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని షహబాజ్‌గా గుర్తించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, అనామిక అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్ షహబాజ్ వీధిలో వేరొక మహిళతో కనిపించేసరికి తట్టుకోలేకపోయింది. అతడితో వాగ్వాదానికి దిగింది. అతడి కారుకు ఎదురుగా నిలబడి నిలదీసింది. ఈ క్రమంలో నిందితుడు కారును ముందుకు పోనిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో ఆమె కారు బానెట్‌పై ఎక్కి అతడిని కదలనిచ్చేది లేదని చెప్పింది. నిందితుడు మాత్రం లెక్కచేయకుండా కారును ముందుకు తోలడంతో ఆమె పక్కకు పడిపోయింది. స్వల్ప గాయాలైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
అనామిక, షహజాద్ కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, షహబాజ్ తన అసలు పేరు దాచిపెచ్చి యష్ ఠాకూర్‌గా పరిచయం ఏర్పరుచుకున్నాడని మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడు తన పేరు మార్చుకుని మహిళను మోసం చేశాడా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి మధ్య ఘర్షణకు మునుపు ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏటీఎమ్‌లో ఫెవిక్విక్ వేస్తారు.. ఇట్టే డబ్బులు దోచేస్తారు.!
ప్లే స్కూల్‌లో దారుణం.. 3 ఏళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి..