బస్సులో వివాహితపై అత్యాచారం.. ఢిల్లీలో ఘటన
ABN , Publish Date - May 14 , 2026 | 11:46 AM
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక వివాహిత ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారం చేశారని ఒక వివాహిత ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను తాజాగా అరెస్టు చేశారు. నగరంలోని రాణీబాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమె మంగోల్‌పురిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పీతమ్‌పురాలో నివస్తున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కాగా, సోమవారం రాత్రి విధులు ముగించుకున్న ఆమె తిరిగివస్తుండగా సరస్వతీ విహార్ వద్ద ఒక స్లీపర్ బస్సు వచ్చి ఆగింది. బస్సు డోర్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తి మొదట బాధితురాలిని టైమ్ అడిగి ఆ తరువాత బలవంతంగా బస్సులోకి ఎక్కించాడు.
ఆ తరువాత బస్సును నాంగ్లోయి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నిందితులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలనూ చదవండి:
సోషల్ మీడియాలో కోడలి రీల్స్.. అత్తమామల ఆత్మహత్య
ఏడేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం