ఏడేళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం
ABN , Publish Date - May 14 , 2026 | 03:48 AM
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో బుధవారం దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఆదే గ్రామానికి చెందిన యువకుడు రమణి నరేశ్..
వికారాబాద్ జిల్లాలో దారుణం
బషీరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో బుధవారం దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఆదే గ్రామానికి చెందిన యువకుడు రమణి నరేశ్ (25) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తన నానమ్మ ఇంటి ముందు అడుకుంటుండగా ఆ యువకుడు బలవంతంగా పాడుబడిన భవనంలోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు నిందుతుడిని పట్టుకుని చితకబాదినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యాచార నిందితుడు సోషల్ మీడియాలో పని చేస్తున్నట్లు తెలిసింది.