7 ఏళ్లుగా మహిళతో రిలేషన్‌షిప్.. బ్రేకప్ చెప్పిందని..
ABN , Publish Date - Nov 22 , 2026 | 03:10 PM
ఏడేళ్లుగా ఓ మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తి బ్రేకప్ తరువాత ఆమె ఇంటికి నిప్పుపెట్టిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏడేళ్లుగా ఓ మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తి బ్రేకప్ తరువాత ఆమె ఇంటికి నిప్పుపెట్టిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మహిళతో పాటు ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న తరుణంలోనే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. మాన్‌పాడా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని దిపేశ్ రస్తోగీగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ, రస్తోగీ ఏడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. రస్తోగీతో అభిప్రాభేదాలు రావడంతో ఇటీవల ఆమె బంధాన్ని కొనసాగించేందుకు నిరాకరించింది. దీంతో, ఉన్మాదిలా మారిన రస్తోగీ దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ఫ్లాట్‌కు వెళ్లి ఎంట్రన్స్ తలుపుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో మహిళతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన వారు మంటలు అదుప తప్పేలోపే ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. వారంతా సేఫ్‌గా బయటపడ్డారు.
మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రస్తోగీని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
మానసిక ఒత్తిడితోనే కుటుంబం ఆత్మహత్య