మద్యం మత్తులో వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:53 AM
మద్యం మత్తులో ఓ బాలుడు వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
చిలుపూర్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఓ బాలుడు వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 79 ఏళ్ల వృద్ధురాలి భర్త 20 ఏళ్ల క్రితం చనిపోగా, కుమారుడు హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఆమె సమీప బంధువు 17 ఏళ్ల బాలుడు (చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు) ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు. తెలిసినవాడే కదా అని వృద్ధురాలు తలుపు తీయగా, అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ బాలుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. వృద్ధురాలు నిరోధించేందుకు ప్రయత్నించడంతో ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడు. బాధితురాలి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.