భారత వాయుసేన సమచారం పాకిస్థాన్‌కు లీక్.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్..
ABN , Publish Date - Mar 23 , 2026 | 03:11 PM
భారత్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలతో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన సుమిత్ కుమార్ అనే వ్యక్తి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులకు సమచారం అందింది.
భారత్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగిని గూఢచర్యం ఆరోపణలతో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుమిత్ కుమార్ అనే వ్యక్తి పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులకు సమచారం అందింది. నిందితుడికి పాక్ హ్యాండ్లర్లతో విస్తృతంగా పరిచయాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేరే కేసులో తీగ లాగితే ఈ వ్యవహారం బయటపడింది (Defence secrets leak Pakistan).
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన జబరా రామ్ అనే వ్యక్తిని ఓ కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్న సమయంలో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సంబంధం ఉన్న సుమిత్ కుమార్ (36) గురించి బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌కు చెందిన సుమిత్ కుమార్.. అస్సాంలోని చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మల్టీ టాస్కింగ్ వింగ్‌లో పని చేస్తున్నాడు. వాయుసేనకు సంబంధించిన అత్యంత కీలక రహస్యాలను సేకరించిన సుమిత్ వాటిని పాకిస్థాన్‌కు అందించినట్టు తేలింది (Air Force civilian arrested).
డబ్బు కోసం సుమిత్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వాయుసేన రహస్యాలను పాక్‌కు పంపించినట్టు బయటపడింది (India spy network bust). రాజస్థాన్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఆపరేషన్‌ను నిర్వహించి సుమిత్ కుమార్‌ను అరెస్ట్ చేశాయి. అతడిని అరెస్ట్ చేసి జైపూర్‌కు తరలించారు. సుమిత్‌కు 2023 నుంచి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. పాక్ అధికారుల నుంచి డబ్బు తీసుకుని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని యుద్ధ విమానాలు, క్షిపణులు, వాటి స్థానం, ఎయిర్‌ఫోర్స్ అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన కీలక సమచారాన్ని చేరవేసినట్టు తేలింది.