Share News

కాబోయే భార్యను ఫ్లాట్‌కు రమ్మని చెప్పిన యువకుడు.. ఇంతలో దారుణం!

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:08 PM

కాబోయే భార్యను తన ఫ్లాట్‌కు రమ్మని చెప్పిన ఒక యువకుడు ఆమె వచ్చే లోపే మరణించాడు. లైంగిక సామర్థ్యం పెంచేందుకు వేసుకున్న ఔషధాలు వికటించడంతో అతడు మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుగ్రామ్‌లో (హర్యానా) ఈ ఘటన ఇటీవల వెలుగు చూసింది.

కాబోయే భార్యను ఫ్లాట్‌కు రమ్మని చెప్పిన యువకుడు.. ఇంతలో దారుణం!

ఇంటర్నెట్ డెస్క్: కాబోయే భార్యను తన గదికి రమ్మని చెప్పిన ఒక యువకుడు ఆమె వచ్చే లోపే మరణించిన ఉదంతం గురుగ్రామ్‌లో (హర్యానా) ఇటీవల చోటుచేసుకుంది. లైంగిక సామర్థ్యం పెంచే ఔషధాలను అధిక డోసులో వేసుకోవడంతో అతడు మరణించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్ లాల్ (29) న్యూఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. గురుగ్రామ్‌లోని సెక్టర్ 53లోగల ఒక ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతడు తరచూ తన సహోద్యోగితో కలిసి ఆఫీసుకు వెళుతుంటాడు. గురువారం ఉదయం రోహిత్‌కు అతడి సహోద్యోగి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఇంటికి వెళ్లి చూడగా రోహిత్ తలుపు కూడా తీయలేదు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా రోహిత్ తన బెడ్‌పై అచేతనంగా కనపించాడు. అతడి గదిలో కొన్ని ఔషధాలు, హెల్త్ సప్లిమెంట్స్‌ కూడా కనిపించాయి.


రోహిత్ అంతకుముందు కాబోయే భార్యను తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆమె వచ్చే లోపే అతడు కన్నుమూశాడని అన్నారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధాలను రోహిత్ వేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అధిక డోసులో మందులను వేసుకోవడంతో అవి వికటించి రోహిత్ గుండెపోటుతో మరణించి ఉండవచ్చని అన్నారు. గదిలోని మందులు పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. పోస్టు మార్టం అనంతరం రోహిత్ మృతదేహాన్ని అతడి కుటుంబానికి అప్పగించారు. అన్ని రిపోర్టులు వచ్చిన తరువాతే రోహిత్ మరణానికి కారణం తెలుస్తుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

స్నేహితుడిని చంపేసి.. పాతిపెట్టి..

కార్పొరేట్‌ స్కూల్‌ సూపర్‌వైజర్‌ కామ చేష్టలు

Updated Date - Apr 25 , 2026 | 01:42 PM