Share News

జాబ్ లేక ఇంట్లోనే భర్త.. భార్యను దోశల పెనంతో కొట్టి హత్య

ABN , Publish Date - Jul 05 , 2026 | 07:17 PM

ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను దోశల పెనంతో కొట్టి చంపేశాడు.

జాబ్ లేక ఇంట్లోనే భర్త.. భార్యను దోశల పెనంతో కొట్టి హత్య
Delhi Man Kills Wife with Tawa

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను దోశల పెనంతో కొట్టి చంపేశాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, దినేశ్ పటేల్ అనే వ్యక్తి గత రెండు మూడేళ్లుగా షిజోఫ్రేనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఐటీ రంగానికి చెందిన అతడికి రెండు నెలల క్రితం ఉద్యోగం కూడా పోయింది. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక పరిస్థితితో పాటు అతడి మానసిక ఆరోగ్యం కూడా దిగజారసాగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.


శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో దినేశ్ విచక్షణ మరిచి భార్య సరితను దోశల పెనంతో పదే పదే కొట్టడంతో ఆమె మరణించింది. ఆ మరుసటి రోజు దినేశ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. జరిగిన విషయం చెప్పి భార్యను తానే చంపానని అంగీకరించాడు. కోపం అణుచుకోలేక పదే పదే ఆమెను పెనంతో కొట్టడంతో అక్కడిక్కడే కన్నుమూసిందని చెప్పాడు.

దినేశ్, సరితలకు 2005లో వివాహం జరిగిందని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌లకు ప్రిపేర్ అవుతుండగా రెండవ కుమారుడు ఐదో తరగతిలో ఉన్నాడు. ఇటీవల జాబ్ పోవడంతో దినేశ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

Updated Date - Jul 05 , 2026 | 07:26 PM