పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:31 AM
అప్పుల విషయమై ఏర్పడ్డ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గద్వాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): అప్పుల విషయమై ఏర్పడ్డ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కుర్వపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కుర్వ గోపాల్(45) తన సొంత భూమితో పాటు కౌలుభూమిలో వ్యవసాయం చేసేవాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో చేసిన అప్పులు మిగిలిపోయాయి. వీటికోసం కొంత భూమిని కూడా విక్రయించాడు. ఈ విషయంలో కుటుంబంలో వచ్చిన మనస్పర్థలు అతడిని మనస్తాపానికి గురిచేశాయి. దీంతో పశువుల కొట్టం వద్ద కుటుంబసభ్యులు లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అతని కుమారుడు గమనించి గద్వాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.