హోలీ వేడుకల్లో విషాదం
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:19 AM
ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను జరుపుకొన్న ముగ్గురు మిత్రులు రంగులు కడుక్కునేందుకు చెరువులో దిగి మునిగి దుర్మరణం పాలయ్యారు.
చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి
కృష్ణా జిల్లాలో ఘటన
గన్నవరం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను జరుపుకొన్న ముగ్గురు మిత్రులు రంగులు కడుక్కునేందుకు చెరువులో దిగి మునిగి దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిక్కవరం శివారు కండ్రిక గ్రామానికి చెందిన దుప్పుల వినయ్‌కుమార్(14) 8వ తరగతి, ముచ్చు వెంకట జోసఫ్ (15), బోళ్ల మోహన్‌సాయి(15) పదవ తరగతి చదువుతున్నారు. ఉదయం నుంచి హోలీ వేడుకలు జరుపుకొన్నారు. ఈ క్రమంలో చీకటి పడుతున్నా ఇళ్లకు రాకపోవటంతో వారి తల్లిదండ్రులు గ్రామంలో ఆరా తీశారు. సాయంత్రం కాళ్లు కడుక్కునేందుకు చెరువులో దిగడం చూసినట్టు స్థానికులు చెప్పారు. వెంటనే గ్రామస్థులు చెరువులో గాలించగా వినయ్‌కుమార్, వెంకట జోసఫ్, మోహన్‌సాయి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమారుల మృతదేహాలను చూసి వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.