అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:04 AM
అప్పుల బాధతో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది.
రామన్నపేట, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధతో చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చేనేత పని నిమిత్తం ఐదేళ్ల క్రితం భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.3.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. నెల నెలా కొంత మొత్తం చెల్లిస్తూ ఆ రుణాన్ని తీరుస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలలుగా పనులు లేకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో బాలరాజు మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.