Share News

3వేలు పంపు.. లేదంటే నెట్‌లో న్యూడ్‌ ఫొటోలు పెడతాం!

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:57 AM

మూడువేల రూపాయలు పంపకపోయావో నీ న్యూడ్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించడంతో...

3వేలు పంపు.. లేదంటే నెట్‌లో న్యూడ్‌ ఫొటోలు పెడతాం!

  • వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్‌

  • వాట్సా్‌పకు న్యూడ్‌ ఫొటోలు పంపడంతో ఆందోళన

  • ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య.. రాంనగర్‌లో ఘటన

చిక్కడపల్లి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మూడువేల రూపాయలు పంపకపోయావో నీ న్యూడ్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించడంతో ఆ వ్యక్తి తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పరిధిలోని రామ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. నారాయణపేటకు చెందిన ప్రేమ్‌కుమార్‌ (36) కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడే కూలీ పనులు చేసుకునేవాడు. మూడేళ్ల క్రితం ప్రేమ్‌కుమార్‌కు నాగవేణి అనే యువతితో పెళ్లయింది. వీరికి పిల్లల్లేరు. ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి రాంనగర్‌లో ఉంటున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ ఆస్పత్రి క్యాంటీన్‌లో నాగవేణి పనిచేస్తోంది. ప్రేమ్‌కుమార్‌ ఆ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో టీ, స్నాక్స్‌ అమ్ముతున్నాడు. సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు, ప్రేమ్‌కుమార్‌ వాట్సా్‌పకు మార్ఫింగ్‌ చేసిన అతడి న్యూడ్‌ ఫొటోలను పంపారు. ఆపై ఫోన్‌ చేసి రూ. 3 వేలు పంపాలని, లేదంటే ఆ న్యూడ్‌ ఫొటోలతో పాటు.. కుటుంబసభ్యులందరి న్యూడ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయంలో ప్రేమ్‌కు భార్య, ఆమె కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వారు సూచించినట్లు తెలిసింది. అయితే దుండగుల నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో ప్రేమ్‌కుమార్‌ తీవ్ర మానసిక ఒత్తిడికిలోనయ్యాడు. మంగళవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్రేమ్‌ను బెదిరింపులకు గురిచేసింది సైబర్‌ నేరగాళ్లా? లోన్‌ యాప్‌ నిర్వాహకులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 05 , 2026 | 03:57 AM