ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!?
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:55 AM
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ముగ్గురు బాలికలపై ఓ బాలుడు లైంగికదాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులిస్తానంటూ నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి ఘాతుకం
బాలుడిపై కేసు నమోదు.. ఆసిఫాబాద్ జిల్లా లో ఘటన
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో ముగ్గురు బాలికలపై ఓ బాలుడు లైంగికదాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిఽధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ గ్రామంలో ఆదివారం ఆరేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు, తొమ్మిదేళ్ల వయసున్న మరో బాలిక ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. అప్పుడు ఆ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బాలుడు(13) వారి వద్దకు వెళ్లాడు. డబ్బులు ఆశ చూపి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి వారిని తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కౌటాల సీఐ సంతోశ్, ఎస్సై నరేశ్ మంగళవారం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. బాలికలనుఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.