Share News

కల్తీపాల ఘటనలో మరొకరు మృతి

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:22 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరొకరు మృతి చెందారు.

కల్తీపాల ఘటనలో మరొకరు మృతి

రాజమహేంద్రవరం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరొకరు మృతి చెందారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న జి.వెంకటలక్ష్మి (69) గురువారం మరణించారని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకూ 9 మంది మృత్యువాతపడగా.. 11 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.

Updated Date - Mar 06 , 2026 | 04:22 AM