Share News

రెండ్రోజుల్లో రూ.2.4 కోట్ల లాభాలు.. రూ.99.50 లక్షలకు బురిడీ

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:42 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న కాంబోడియా ముఠాకు పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన..

రెండ్రోజుల్లో రూ.2.4 కోట్ల లాభాలు.. రూ.99.50 లక్షలకు బురిడీ

  • హైదరాబాద్‌ వ్యక్తికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న కాంబోడియా ముఠాకు పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు సైబర్‌ నేరగాళ్లను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి రెండ్రోజుల్లో రూ.2.4 కోట్లు లాభాలు చూపెట్టి రూ.99.50 లక్షలు కొట్టేసిన కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం సమీపంలోని పెందుర్తికి చెందిన రాపర్తి గౌతమ్‌, గాజువాకకు చెందిన సేనాపతి పెంటయ్య, మురపాలకు కుమార్‌, మంత్రి సాయికుమార్‌, విశాఖకు చెందిన బోడాల సాయికుమార్‌, విజ్జిపు సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రాంతానికి చెందిన ఉట్ల సత్యనారాయణను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.36లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jun 21 , 2026 | 05:44 AM