జెరోధా ఇంట్రా డే ఎఫ్ అండ్ ఓ ఫీజు రెట్టింపు
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:03 AM
డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జెరోధా ఎంపిక చేసిన ఇంట్రా డే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఫీజులను రెట్టిం పు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు...
ముంబై: డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జెరోధా ఎంపిక చేసిన ఇంట్రా డే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఫీజులను రెట్టిం పు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుం ది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి జెరోధా రూ.20 చొప్పున వసూలు చేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఇది రూ.40కి చేరనుంది. సెబీ నిబంధనల ప్రకారం 50ు నగదు హామీ లేని లావాదేవీలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో లావాదేవీలు పడిపోతున్న సమయం లో జెరోధా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) పెంపు సైతం ఏప్రిల్ నుంచే అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి ఫ్యూచర్స్ లావాదేవీలపై ఇప్పటి వరకు ఉన్న 0.02 శాతం ఎస్‌టీటీ 0.05 శాతానికి, ఆప్షన్‌పై ఉన్న ఎస్‌టీటీ 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెరగనుంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్