Share News

ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ కోసం ‘ఏఐ సీఓఈ’ : విప్రో

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:13 AM

ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ ఏఐ మోడల్స్‌పై విప్రో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులోని తన ఇన్నోవేషన్‌ హబ్‌లో ‘అప్లైడ్‌ ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ (సీఓఈ) పేరుతో...

ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ కోసం ‘ఏఐ సీఓఈ’ :  విప్రో

న్యూఢిల్లీ: ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ ఏఐ మోడల్స్‌పై విప్రో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులోని తన ఇన్నోవేషన్‌ హబ్‌లో ‘అప్లైడ్‌ ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ (సీఓఈ) పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా వచ్చే ఏడాదిన్నర కాలంలో 10,000 ఇంజనీర్లకు ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ మోడల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్టు విప్రో ప్రకటించింది. ఈ శిక్షణ సర్టిఫికెట్లు పొందిన ఇంజనీర్లు.. కంపెనీలు త్వరగా ఏఐ టూల్స్‌కు మారేందుకు సహకరిస్తారు. ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌.. విప్రో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఏఐ-నేటివ్‌ బిజినెస్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ యూనిట్‌’ నుంచి పని చేయనుంది.

ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 17 , 2026 | 03:13 AM