బెర్క్‌షైర్ హ్యాత్‌వే నుంచి తప్పుకున్న వారెన్ బఫెట్
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:44 AM
ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ మదుపరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (96).. బెర్క్‌షైర్ హ్యాత్‌వే కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడు హోవర్డ్ బఫెట్.. కంపెనీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు
న్యూయార్క్: ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ మదుపరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (96).. బెర్క్‌షైర్ హ్యాత్‌వే కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడు హోవర్డ్ బఫెట్.. కంపెనీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్‌గా రిటైరైనా వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హ్యాత్‌వే కంపెనీ గౌరవ చైర్మన్‌గా, డైరెక్టర్‌గా కొనసాగుతారు. దాదాపు ఆరు దశాబ్ధాలకు పైగా చైర్మన్‌గా కొనసాగిన వారెన్ బఫెట్ ఆ సంస్థ పెట్టుబడుల విలువను లక్ష కోట్ల డాలర్లకు (సుమారు రూ.95.60 లక్షల కోట్లు) పెంచారు.