వియాష్ సైంటిఫిక్ లాభం రూ.66 కోట్లు
ABN , Publish Date - May 20 , 2026 | 05:38 AM
వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ (గతంలో సీక్వెంట్ సైంటిఫిక్).. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ (గతంలో సీక్వెంట్ సైంటిఫిక్).. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.920 కోట్ల ఆదాయంపై రూ.66.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కాగా 2025- 26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.3,420.30 కోట్ల ఆదాయంపై రూ.224.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీకి చెందిన ప్లాంట్లు, కార్యకలాపాలను విజయవంతంగా అనుసంధానం చేయటంతో మంచి ఫలితాలను నమోదు చేసినట్లు వియాష్ సైంటిఫిక్ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..