Share News

VITEEE 2027 దరఖాస్తులు ప్రారంభం.. ఏప్రిల్ 28 నుంచి ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Oct 26 , 2026 | 08:00 PM

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే వీఐటీ ఈఈఈ (VITEEE) 2027 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది.

VITEEE 2027 దరఖాస్తులు ప్రారంభం.. ఏప్రిల్ 28 నుంచి ప్రవేశ పరీక్ష

చెన్నై: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే వీఐటీ ఈఈఈ (VITEEE) 2027 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వీఐటీ క్యాంపస్‌లలో అందించే ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://viteee.vit.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వేలూరు, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ క్యాంపస్‌లలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఏప్రిల్ 28 నుంచి ప్రవేశ పరీక్ష..

VITEEE 2027 ప్రవేశ పరీక్షను ఒకే విడతలో నిర్వహించనున్నారు. 2027 ఏప్రిల్ 28 నుంచి మే 2 వరకు పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 133 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని 9 కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించనున్నట్లు వీఐటీ వెల్లడించింది. భారత్‌తో పాటు విదేశాల్లోని విద్యార్థులు కూడా ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది.

Updated Date - Oct 26 , 2026 | 08:00 PM