మరింత భద్రంగా డిజిటల్ చెల్లింపులు!
ABN , Publish Date - Jul 03 , 2026 | 02:56 AM
అంతర్జాతీయ పేమెంట్ గేట్‌వే సంస్థ వీసా...గురువారం ‘పేమెంట్ పాస్‌కీ’ సొల్యూషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆన్‌లైన్ కార్డు చెల్లింపుల్లో వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ)కు...
‘పేమెంట్ పాస్‌కీ’ని భారత్‌లో ప్రవేశపెట్టిన వీసా
ముంబై: అంతర్జాతీయ పేమెంట్ గేట్‌వే సంస్థ వీసా...గురువారం ‘పేమెంట్ పాస్‌కీ’ సొల్యూషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆన్‌లైన్ కార్డు చెల్లింపుల్లో వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ)కు ప్రత్యామ్నాయ ధ్రువీకరణగా దీన్ని ప్రవేశపెట్టింది. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంక్‌తో కలిసి దీన్ని ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. మింత్రా, పేటీఎం, మేక్‌మై ట్రిప్, టాటా స్టార్‌బక్స్, రిలయన్స్ డిజిటల్, ఈట్‌ష్యూర్ సహా ఇతర ప్లాట్‌ఫామ్స్‌తో పాటు జస్‌పే, రేజర్‌పే, పేయూ, పైన్‌ల్యాబ్స్, బిల్‌డెస్క్, విబ్‌మో, ఎం2పీ వంటి ఫిన్‌టెక్ సంస్థల ద్వారా జరిపే చెల్లింపులకూ పేమెంట్ పాస్‌కీ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇది ఎలా పనిచేస్తుందంటే..: ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్ (ఎ్‌ఫఐడీఓ) అథెంటికేషన్ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన వీసా పేమెంట్ పాస్‌కీ (వీపీపీ).. కార్డు హోల్డర్లు ఆన్‌లైన్ చెల్లింపులను ఓటీపీకి బదులుగా తమ మొబైల్‌లోని భద్రత ఫీచర్లైన ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్, పిన్, పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ ద్వారా ధ్రువీకరించేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఇవి కూడా చదవండి..
మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్