స్కిన్ కేర్ విభాగంలోకి విజయ్ దేవరకొండ
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:53 AM
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కొంతమంది ఔత్సాహికులతో కలిసి ‘అన్‌హైప్’ పేరుతో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కొంతమంది ఔత్సాహికులతో కలిసి ‘అన్‌హైప్’ పేరుతో స్కిన్‌కేర్ ఉత్పత్తుల యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్పత్తుల అభివృద్ధిలో స్వయంగా పాలు పంచుకోవడమే కాకుండా.. స్వయంగా తొమ్మిది నెలల పాటు వినియోగించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు విజయ్ చెప్పారు. 18 నుంచి 30 ఏళ్ల వయసులో ఉండే యువతను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేసినట్టు విజయ్ తెలిపారు. ఈ నెల 21న ఈ ఉత్పత్తులను పెద్దఎత్తున మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. విజయ్ ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో అపారెల్ ఉత్పత్తుల విభాగంలో ఉన్నారు. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్' వృద్ధి: మోదీ
పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!