Share News

ఐదు కంపెనీలుగా వేదాంత లిమిటెడ్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 06:38 AM

అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాం త లిమిటెడ్‌ వ్యాపారాల విభజన కొలిక్కి వచ్చింది. ఈ హోల్టింగ్‌ కంపెనీ నిర్వహణలోని అల్యూమిని యం, మర్చంట్‌ పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌...

ఐదు కంపెనీలుగా వేదాంత లిమిటెడ్‌
Vedanta demerger news

ఆమోదించిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు

న్యూఢిల్లీ: అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాం త లిమిటెడ్‌ వ్యాపారాల విభజన కొలిక్కి వచ్చింది. ఈ హోల్టింగ్‌ కంపెనీ నిర్వహణలోని అల్యూమిని యం, మర్చంట్‌ పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఐరన్‌ ఓర్‌ వ్యాపారాలను నాలుగు లిస్టెడ్‌ కంపెనీలుగా విభజించేందుకు వేదాంత లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. కొత్త కంపెనీల్లో వాటాల కోసం మే 1ని రికార్డు డేట్‌గా నిర్ణయించింది. ఆ తేదీ నాటికి వేదాంత లిమిటెడ్‌ ఈక్విటీలో మదుపరులకు ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు కొత్త గా ఏర్పాటు చేసే కంపెనీల్లో లభిస్తాయి.

విభజన ఇలా: ఈ విభజన ద్వారా అల్యూమినియం వ్యాపారంలో ఉన్న వేదాంత అల్యూమిని యం మెటల్‌ లిమిటెడ్‌ (వీఏఎంఎల్‌), విద్యుత్‌ వ్యాపారంలో ఉన్న తల్వాండి సాబో పవర్‌ లిమిటెడ్‌ (టీఎ్‌సపీఎల్‌), ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వ్యాపారంలో ఉన్న మాల్కొ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎంఈఎల్‌), ఐరన్‌ ఓర్‌ బిజినె్‌సలో ఉన్న వేదాంత ఐరన్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (వీఐఎల్‌ఎల్‌) నాలుగు ప్రత్యేక కంపెనీలుగా స్టాక్‌ ఎక్స్చేంజిల్లో లిస్టవుతాయని వేదాంత స్టాక్‌ ఎక్స్చేంజిలకు తెలిపింది.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 06:44 AM