ఎక్కువ మంది వాడని యూపీఐ ఫీచర్లు ఇవే
ABN , Publish Date - Mar 13 , 2026 | 08:24 PM
యూపీఐ గురించి అందరికీ తెలిసినా కొన్ని ఫీచర్లను మాత్రం జనాలు అంతగా వినియోగించట్లేదని పరిశీలకులు అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్ గురించి తెలియని భారతీయుడు ఉండటంటే అతిశయోక్తి కాదు. చెల్లింపుల రంగంలో ఇది ఒక విప్లవమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతారు. అయితే, ఎక్కువ మంది తమ యూపీఐ యాప్స్‌తో క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేసి చెల్లింపులు చేస్తారు. యూపీఐలో అందుబాటులో ఉన్న ఇతర ఫీచర్స్‌ను పట్టించుకోరు. జనాలు పెద్దగా వాడని ఈ ఫీచర్స్ ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
చిన్న మొత్తాల చెల్లింపుల కోసం యూపీఐ లైట్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని సాయంతో పిన్ లేకుండానే డబ్బులు చెల్లించొచ్చు. ఇది డివైజ్‌లోని వాలెట్‌లా పనిచేస్తుంది. ఇందులో డబ్బును రూ. 5000 వేల వరకూ లోడ్ చేసుకుని మరింత ఈజీగా చెల్లింపులు జరపవచ్చు.
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సామర్థ్యం ఉన్న ఫోన్‌లలో టాప్ అండ్ పే ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. దీని ద్వారా మర్చెంట్ డివైజ్ లేదా ఎన్‌ఎఫ్‌సీ ఉన్న క్యూఆర్ ట్యాగ్‌ను టాప్ చేస్తే స్కానింగ్ లేకుండానే చెల్లింపులు జరిగిపోతాయి. అయితే, ఒక పరిమితి దాటాక మాత్రం పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, పెట్టుబడులు, విద్యుత్, నీటి బిల్లుల వంటివి నెలనెలా క్రమం తప్పకుండా చెల్లించేందుకు యూపీఐ ఆటో పే ఫీచర్‌ను వాడుకోవచ్చు. దీనితో ఆటోమేటిక్‌గా బిల్లులు చెల్లించొచ్చు.
యూపీఐ ద్వారా చిన్న మొత్తాల్లో అప్పులు తీసుకునే అవకాశం కూడా ఉంది. దీన్ని ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ అని అంటారు. క్రెడిట్ కార్డు తరహా సౌకర్యాన్ని యూపీఐ వ్యవస్థలో భాగం చేసేలా ఈ క్రెడిట్ ఆన్ యూపీఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఇక యూపీఐ లైట్‌లోని డబ్బులు అయిపోయినప్పుడల్లా ఆటోమేటిక్‌గా టాపప్ చేసేందుకు యూపీఐ లైట్ ఆటో టాప్‌అప్ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఒక పరిమితికి మించి యూపీఐ లైట్‌లో డబ్బు తగ్గితే ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్‌నుంచి యూపీఐ లైట్ లోకి డబ్బు బదిలీ అవుతుంది.
ఇక యూపీఐ లైట్ ఎక్స్ సాయంతో యూజర్లు ఆఫ్‌లైన్‌లో కూడా డబ్బులు ట్రాన్సఫర్ చేయొచ్చు. నెట్‌వర్క్ సిగ్నల్స్ తక్కువగా ఉన్న చోట ఇది ఉపయోగపడుతుంది.
ఈ వార్తలూ చదివండి:
దేశంలో గ్యాస్ కొరత.. గ్యాస్ ఛార్జీలు వసూలు చేస్తున్న హోటల్స్..
బేజారెత్తిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు!