Share News

United Breweries Land Sale: రూ.80 కోట్లకు నాచారం భూముల విక్రయం

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:51 AM

లిక్కర్‌ కంపెనీ యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యూబీఎల్‌) హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలో తన ఎనిమిది ఎకరాల భూమిని...

United Breweries Land Sale: రూ.80 కోట్లకు నాచారం భూముల విక్రయం

యునైటెడ్‌ బ్రూవరీస్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లిక్కర్‌ కంపెనీ యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ (యూబీఎల్‌) హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలో తన ఎనిమిది ఎకరాల భూమిని విక్రయించింది. ఈ భూమిని ఎకరా రూ.10 కోట్ల చొప్పున టాప్‌సన్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.80.8 కోట్లకు విక్రయించినట్టు రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. యూబీఎల్‌ గతంలో ఇక్కడి ప్లాంట్‌లో మెక్‌డోవెల్‌ విస్కీ తయారు చేసేది. అయితే ప్రస్తుతం ఈ ప్లాంటులో ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాలు జరగడం లేదు. దీంతో ఖాళీగా ఉన్న ఈ భూమిని కంపెనీ అమ్మి సొమ్ము చేసుకుందని భావిస్తున్నారు.

కెరీర్‌పరంగా యువత అత్యుత్తమ అవకాశాలను దక్కించుకునేందుకు హైదరాబాద్‌లో ఉచిత డేటా ఇంజనీరింగ్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు శ్రీ సత్యసాయి స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రొగ్రామ్‌ ప్రకటించింది. 2022-25 మధ్య కాలంలో ఎంఎ్‌ససీ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ 90 రోజుల ఇంటెన్సివ్‌ కోర్సుకు అర్హులు.

ఇవి కూడా చదవండి..

ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..

మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 20 , 2026 | 05:51 AM