Share News

Union Bank of India: యూబీఐ లాభంలో 9.7 శాతం వృద్ధి

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:17 AM

ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) 2025 డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.5,073 కోట్ల ఏకీకృత నికర లాభం...

Union Bank of India: యూబీఐ లాభంలో 9.7 శాతం వృద్ధి

ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) 2025 డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.5,073 కోట్ల ఏకీకృత నికర లాభం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన లాభం 9.7% వృద్ధి చెందింది. కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడినట్టు బ్యాంక్‌ తెలిపింది. గడిచిన మూడు నెలలకు బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 0.95% పెరిగి రూ.9,328 కోట్లుగా నమోదు కాగా.. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.76 శాతానికి తగ్గింది. బ్యాంక్‌ రుణ వృద్ధి 7.13 శాతంగా, డిపాజిట్ల వృద్ధి 3.36 శాతంగా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం 2.28ు పెరిగి రూ.4,541 కోట్లకు చేరింది. గడిచిన త్రైమాసికంలో రూ.1,820 కోట్ల రుణాలు మొండిబాకీలుగా మారాయని, స్థూల మొండి బాకీలు మాత్రం 3.06 శాతానికి తగ్గాయని బ్యాంక్‌ వెల్లడించింది. మొండి బకాయిలతోపాటు ఇతర అవసరాల కోసం కేటాయింపులు 322.23 కోట్లకు తగ్గాయి.

ఇవి కూడా చదవండి..

చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 15 , 2026 | 06:17 AM