అన్‌క్లెయిమ్డ్ ఆర్థిక ఆస్తులు రూ.లక్ష కోట్లు దాటాయ్..
ABN , Publish Date - May 26 , 2026 | 05:41 AM
ఇప్పటివరకు ఎవరూ హక్కు కోరని (అన్‌క్లెయిమ్డ్) ఆర్థిక ఆస్తుల మొత్తం విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.1 లక్షల కోట్లకు చేరుకుంది. లోక్‌సభకు ప్రభు త్వం సమర్పించిన డేటా ప్రకారం...
న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఎవరూ హక్కు కోరని (అన్‌క్లెయిమ్డ్) ఆర్థిక ఆస్తుల మొత్తం విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.1 లక్షల కోట్లకు చేరుకుంది. లోక్‌సభకు ప్రభు త్వం సమర్పించిన డేటా ప్రకారం.. 2025-26 లో అన్‌క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్లు రూ.83,000 కోట్లు దాటగా.. అన్‌క్లెయిమ్డ్ ఈక్విటీలు రూ.10,000 కోట్లు, క్లెయిమ్ చేయని బీమా పాలసీల విలువ రూ.14,000 కోట్లకు చేరింది. దాంతో ఈ ఆస్తులు ఆయా రంగాల నియంత్రణ సంస్థల ఆధీనంలో ఉన్నాయి.
అప్పట్లో డిజిటల్ కేవైసీ లేకపోవడం వల్లే : అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను బ్యాంకింగ్ నియంత్రణ మండలి ఆర్‌బీఐ.. ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’లో నిల్వ చేయగా.. క్లెయిమ్ చేయని ఈక్విటీల సొమ్మును మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్’ లో ఉంచింది. అన్‌క్లెయిమ్డ్ బీమా పాలసీల సొమ్ము భారత బీమా అభివృద్ధి నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఆధీనంలో ఉంది. అన్‌క్లెయిమ్డ్ ఆస్తుల్లో చాలావరకు పాత ఖాతాలకు సంబంధించినవేనని, అప్పట్లో డిజిటల్ కేవైసీ అందుబాటులో లేకపోవడం వల్లే వచ్చిన సమస్య ఇదని మార్కెట్ వర్గాలన్నాయి.
గత ఏడాది రూ.5,777 కోట్ల ఆస్తుల రీక్లెయిమ్: అన్‌క్లెయిమ్డ్ ఆస్తులపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు గత ఏడాది ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏఐ కలిసి ‘మీ సొమ్ము, మీ హక్కు’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. దాంతో మదుపరులు, వారి నామినీలు గత సంవత్సరం రూ.5,777 కోట్ల ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..