Share News

యూకో బ్యాంక్‌ లాభం రూ.656 కోట్లు

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:15 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో యూకో బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను బ్యాంక్‌ నికర లాభం 8 శాతం...

యూకో బ్యాంక్‌ లాభం రూ.656 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో యూకో బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గాను బ్యాంక్‌ నికర లాభం 8 శాతం వృద్ధి చెంది రూ.656 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.607 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా రూ.7,433 కోట్ల నుంచి రూ.8,682 కోట్లకు పెరిగింది. త్రైమాసిక కాలంలో వడ్డీ ఆదాయం రూ.6,436 కోట్ల నుంచి రూ.6,996 కోట్లకు పెరగటం కలిసి వచ్చిందని యూకో బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాజేంద్ర కుమార్‌ సాబు తెలిపారు. ఈ కాలంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 17 శాతం వృద్ధితో రూ.2,403 కోట్ల నుంచి రూ.2,808 కోట్లకు చేరుకుంది. బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 2.63 శాతం నుంచి 2.08 శాతానికి, నికర ఎన్‌పీఏలు కూడా 0.45 శాతం నుంచి 0.25 శాతానికి తగ్గాయి. సమీక్షా కాలంలో మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు కూడా రూ.463 కోట్ల నుంచి రూ. 254 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), ఓసీఐలు, పీఐఓల నుంచి ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్లు, బాండ్ల ద్వారా 50 కోట్ల డాలర్లు సమీకరించాలని చూస్తున్నట్లు యూకో బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాజేంద్ర కుమార్‌ సాబు తెలిపారు. ఇందులో 25 కోట్ల డాలర్లు ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) ద్వారా, మిగిలిన మొత్తాలను ఓవర్సీస్‌ ఫారిన్‌ కరెన్సీ బారోయింగ్స్‌ (ఓఎ్‌ఫసీబీ) ద్వారా సమీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా గుజరాత్‌ గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఐఎ్‌ఫఎ్‌ససీ బ్యాంకింగ్‌ యూనిట్‌ (ఐబీయు)ను ఏర్పాటు చేయనున్నట్లు యూకో బ్యాంక్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..

పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 23 , 2026 | 03:15 AM