Share News

యూకో బ్యాంకు లాభం రూ.801 కోట్లు

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:13 AM

ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంకు నికర లాభం 2025-26 ఆర్థిక సంవ త్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి రూ.801 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి...

యూకో బ్యాంకు లాభం రూ.801 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంకు నికర లాభం 2025-26 ఆర్థిక సంవ త్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి రూ.801 కోట్లుగా నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.653 కోట్ల నికర లాభంకన్నా ఇది 23 శాతం అధికం. అయితే మార్చి త్రైమాసికంలో ఆదాయం మాత్రం రూ.8,137 కోట్ల నుంచి రూ.7,365 కోట్లకు తగ్గింది. సమీక్షా కాలంలో వడ్డీ ఆదాయం రూ.6,142 కోట్ల నుంచి రూ.6,656 కోట్లకు పెరిగింది. నికర లాభాలు పెరిగిన నేపథ్యంలో రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.0.44 డివిడెండ్‌ను బ్యాంకు బోర్డు సిఫారసు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూఐపీ, ఎఫ్‌పీవో వంటి మార్గాల ద్వారా రూ.2,700 కోట్లు సేకరించే ఈక్విటీ మూలధన సమీకరణ ప్రణాళికకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి త్రైమాసికంలో బ్యాంకు నికర వడీ ్డ ఆదాయం 3.1 శాతం తగ్గి రూ.2,698.4 కోట్ల నుంచి రూ.2,614.3 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం మార్చిలో ఎన్‌పీఏ ఖాతాలలోని ఒక దాని నుంచి దాదాపు రూ.283 కోట్లు వసూలయ్యాయని, దీంతో అవి ఆ త్రైమాసిక వడ్డీ ఆదాయంలో భాగంగా ఉన్నాయని, ఈ సంవత్సరంలో అటువంటి రికవరీ లేనందున గత ఏడాదితో పోల్చితే నికర వడ్డీ ఆదాయం తక్కువగా కనిపిస్తోందని యూకో బ్యాంకు ఎండీ, సీఈవో అశ్వనీ కుమార్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 06:13 AM