వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియోల ఫిర్యాదు.. పరిశీలిస్తామనన్న ట్రాయ్
ABN , Publish Date - Sep 14 , 2026 | 09:09 PM
వొడాఫోన్ ఐడియాపై భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: వొడాఫోన్ ఐడియాపై భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా పేర్కొంది. ఈ మేరకు ట్రాయ్ చైర్మన్ ఏకే లహోతీ సోమవారం పేర్కొన్నారు. ‘ఏ ఆపరేటర్ నుంచైనా ఇలాంటివి అందినప్పుడు మేము పరిశీలిస్తాము. వారు తమ ఆందోళనల గురించి తెలిపారు. మేము వాటిని పరిశీలిస్తాము’ అని అన్నారు. అయితే, తదుపరి చర్చల కోసం మూడు టెలికం ఆపరేటర్లను పిలుస్తారా? లేదా అన్న విషయంలో మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.
తమ నెట్‌వర్క్‌కు మారేలా వినియోగదారులను వొడాఫోన్ ఐడియా ప్రోత్సహిస్తోందంటూ భారతీ ఎయిర్‌టెల్, జియోలు అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈ విషయమై ట్రాయ్‌ను కూడా ఆశ్రయించాయి. తమ నెట్‌వర్క్‌కు పోర్టయ్యే వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలను వొడాఫోన్ ఐడియా కల్పిస్తోందని ఆరోపించాయి. నెట్‌వర్క్ మార్పును ప్రోత్సహించేలా ప్రత్యేక టారిఫ్‌లు ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నాయి. ఇక ఈ పరిణామాలపై వొడాఫోన్ స్పందించింది. పోటీలో నైతికత ఉండాలని తాము విశ్వసిస్తామని పేర్కొంది. తమ ఉత్పత్తులు, కస్టమర్లకు కలిగే ప్రయోజనాలపై నమ్మకం ఉందని చెప్పింది. తాము ఎప్పుడు చట్టబద్ధంగానే కార్యకలాపాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
జీసీసీల హాట్‌స్పాట్‌గా హైదరాబాద్