Share News

యాంటీ స్పామ్‌ నిబంధనలు మరింత కఠినం: ట్రాయ్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 02:25 AM

యాంటీ స్పామ్‌ కాల్స్‌ నిబంధనలను టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ మరింత కఠినం చేసింది. వ్యాపార లేదా ఏదైనా వస్తు, సేవల ప్రమోషన్‌ కోసం అనవసరంగా ఫోన్‌ కాల్స్‌ చేసి విసిగించడాన్ని చెక్‌ పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది.

యాంటీ స్పామ్‌ నిబంధనలు  మరింత కఠినం: ట్రాయ్‌
Trai

న్యూఢిల్లీ: యాంటీ స్పామ్‌ కాల్స్‌ నిబంధనలను టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్‌ మరింత కఠినం చేసింది. వ్యాపార లేదా ఏదైనా వస్తు, సేవల ప్రమోషన్‌ కోసం అనవసరంగా ఫోన్‌ కాల్స్‌ చేసి విసిగించడాన్ని చెక్‌ పెట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది. ఇందుకోసం వ్యాపార సంస్థల కోసం నిబంధనలు జారీ చేసింది.

ప్రధాన నిబంధనలు

యాప్స్‌, సాప్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ లేదా ఆటోమేటెడ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా అప్లికేషన్‌ టు పర్సన్‌ (ఏ2పీ) కాల్స్‌ చేయాలంటే.. ఎవరెవరికి ఆ కాల్స్‌ చేయబోతున్నారు? అనే విషయాన్ని ముందుగానే టెలికాం ఆపరేటర్లకు ఇవ్వాలి.

అలా ఇవ్వకపోతే ఆ కాల్స్‌ను స్పామ్‌ కాల్స్‌గా పరిగణించి నిమిషానికి ఐదు పైసల చొప్పున టెర్మినేషన్‌ చార్జీ వసూలు చేస్తారు.

స్పామ్‌ కాల్స్‌పై వచ్చే ఫిర్యాదులను ఆపరేటర్లు 15 రోజుల్లోగా పరిష్కరించాలి.

ఏదైనా టెలీమార్కెటింగ్‌ సంస్థ, తమ వెసులుబాటును దుర్వినియోగం చేస్తే ఏడాది పాటు అన్ని టెలికాం కంపెనీలు ఆ సంస్థను డిస్‌కనెక్ట్‌ చేస్తాయి

Updated Date - Sep 19 , 2026 | 02:26 AM