Share News

రీచార్జ్‌ ప్లాన్లు, ఎస్‌టీవీలను ప్రముఖంగా ప్రదర్శించాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:48 AM

తప్పనిసరి చేసిన రీచార్జ్‌ ప్లాన్లు, స్పెషల్‌ టారిఫ్‌ వోచర్ల (ఎస్‌టీవీ)ను టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల్లో ప్రముఖంగా...

రీచార్జ్‌ ప్లాన్లు, ఎస్‌టీవీలను ప్రముఖంగా ప్రదర్శించాలి

టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు

న్యూఢిల్లీ: తప్పనిసరి చేసిన రీచార్జ్‌ ప్లాన్లు, స్పెషల్‌ టారిఫ్‌ వోచర్ల (ఎస్‌టీవీ)ను టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల్లో ప్రముఖంగా ప్రదర్శించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ గురువారం ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో టెలికాం సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లను పరిశీలించిన ట్రాయ్‌.. నిర్దేశిత ప్లాన్లు సులభంగా కనిపించడంలేవని గుర్తించింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ చేసింది. ‘ట్రాయ్‌ తప్పనిసరి చేసిన ప్యాక్‌లు’ అనే పేరుతో ప్రత్యేకంగా, స్పష్టంగా కనిపించే ట్యాబ్‌ లేదా సెక్షన్‌ను ఏర్పాటు చేయాలని, ఇందులో ట్రాయ్‌ తప్పనిసరి చేసిన వివిధ రకాల వోచర్లు ఉండాలని పేర్కొంది. ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ సెక్షన్‌ మొదటి ట్యాబ్‌లోనే ఇవి ఉండాలని తెలిపింది. ప్రత్యేక విక్రయ కేంద్రాలలోనూ వీటిని ప్రముఖంగా ప్రదర్శించాలని పేర్కొంది. 30 రోజుల్లోగా ఈ ఆదేశాలను టెలికాం సంస్థలు అమలు చేయాలని ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు

రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

Updated Date - Oct 02 , 2026 | 05:48 AM