పన్ను పోటు లేని 10 ఆదాయాలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 03:41 AM
చాలా మందికి సంపాదించేటప్పుడు ఖుషీగానే ఉంటుంది. కానీ ఆ ఆదాయాలపై పన్ను చెల్లించేటప్పుడే సమస్య. కష్టపడి సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించాలని తెగ...
చాలా మందికి సంపాదించేటప్పుడు ఖుషీగానే ఉంటుంది. కానీ ఆ ఆదాయాలపై పన్ను చెల్లించేటప్పుడే సమస్య. కష్టపడి సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించాలని తెగ బాధపడి పోతుంటారు. వీరికోసమేనా అన్నట్టు మన దేశంలో కొన్ని ఆదాయాలను పన్ను పోటు నుంచి పూర్తిగా మినహాయించారు. అటువంటి పది ఆదాయాల గురించి తెలుసుకుందాం.
వ్యవసాయ ఆదాయం
వ్యవసాయ ఆదాయానికి పూర్తి పన్ను మినహాయింపు ఉంది. ఇందుకు ఎలాంటి పరిమితులు కూడా లేవు. అంటే మీకు ఉన్న సాగు భూమిలో పంటలు సాగు చేసి, ఆ పంటలను అమ్మడం ద్వారా లేదా మీ సాగు భూములను వేరొకరికి కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయానికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే వార్షిక వ్యవసాయ ఆదాయం రూ.5,000కు మించి, మీ మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి మించి పోతే మాత్రం పన్ను రేటు లెక్కింపు కోసం పాక్షికంగా పరిగణనలోకి తీసుకుంటారు.
పీపీఎఫ్ రాబడులు
మన దేశంలో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారిలో ముఖ్యంగా ఉద్యోగుల్లో ఎక్కువ మంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎ్‌ఫ)లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ పథకంలో పెట్టే వార్షిక పెట్టుబడుల్లో రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంపై వచ్చే వడ్డీ, పథకం గడువు ముగిసిన తర్వాత చేతికి వచ్చే మొత్తానికి కూడా పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులు పూర్తిగా ఎగ్జెంప్షన్, ఎగ్జెంప్షన్, ఎగ్జెంప్షన్ (ఈఈఈ) పరిధిలోకి వస్తాయి.
ఈపీఎఫ్ విత్‌డ్రాయల్స్
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా నుంచి వెనక్కి తీసుకునే మొత్తాలపైనా చిల్లిగవ్వ కూడా ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి, కంపెనీ జమ చేసిన మొత్తాలతో పాటు ఈపీఎఫ్‌పై చెల్లించే వడ్డీకి కూడా ఇది వర్తిస్తుంది. కాకపోతే ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకునే వ్యక్తి ఈపీఎ్‌ఫలో కనీసం ఐదేళ్ల పాటు సభ్యుడై ఉండాలి. 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయ చట్టంలోనూ ఈ మినహాయింపు, వరుసగా ఐదేళ్ల కనీస కంట్రిబ్యూషన్ నిబంధన కొనసాగనుంది.
బహుమతులు
తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల వంటి దగ్గరి బంధువుల నుంచి అందుకునే బహుమతులకు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, ఆదాయాలకు ఎలాంటి పరిమితి లేకుండా పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. బంధువులు కాని వారి నుంచి ఆందే స్థిర లేదా చరాస్తుల బహుమతుల వార్షిక విలువ రూ.50,000 మించితే మాత్రం పన్ను పోటు తప్పదు. దీన్ని ఇతర ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు. ఎలాంటి ప్రతిఫలం లేకుండా వచ్చే స్థిరాస్తి బహుమతి స్టాంప్ డ్యూటీ రూ.50,000 మించి ఉంటే, పన్ను విధింపు కోసం ఆ స్థిరాస్తి మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు.
ఉపకార వేతనాలు
ఉపకార వేతనాల (స్కాలర్‌షిప్) కింద చెల్లించే మొత్తాలకూ పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే ఈ మినహాయుంపు విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షి్‌పలకు మాత్రమే వర్తిస్తుంది.
ఇచ్చిన మొత్తంలో 10 శాతానికి మించి ఉండకూడదు. అయితే పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే చెల్లించే మొత్తానికి మాత్రం ఇది వర్తించదు.
వీలునామా లేదా వారసత్వ ఆస్తులు
వీలునామా ద్వారా వచ్చే వారసత్వ ఆస్తులపై ఎలాంటి పన్ను పోటు ఉండదు. అయితే ఈ ఆస్తులపై వచ్చే ఆదాయాలు మాత్రం పన్ను పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు ఎవరైనా చనిపోయిన తర్వాత వారి పేరు మీద ఉన్న బ్యాంకు డిపాజిట్లు, రుణ పత్రాలు వారి వారసులకు బదిలీ అవుతాయి. వీటిపై వచ్చే వడ్డీ ఆదాయానికి వాటిని అందుకున్న వ్యక్తే ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చే డివిడెండ్లకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ ఆదాయాన్ని ఆయా వ్యక్తుల రెగ్యులర్ ఆదాయానికి జోడించి వారి శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు.
సుకన్య సమృద్ధి యోజన
సెక్షన్ 80సీ కింద సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎ్‌సవై) పథకంలో పెట్టుబడులకు, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంపై లభించే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తాలకీ పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. దేశంలో బాలికల భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించారు.
ట్యాక్స్ ఫ్రీ బాండ్స్
ప్రభుత్వం లేదా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ (రుణ పత్రాలు) జారీ చేస్తుంటాయి. ఈ బాండ్స్‌పై వచ్చే వడ్డీ ఆదాయానికి పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది.
గ్రాట్యుటీ
ప్రభుత్వ ఉద్యోగులకు అందే గ్రాట్యూటీకి పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే ప్రైవేటు ఉద్యోగులైతే ఆదాయ పన్ను చట్టం నిబంధనలకు లోబడి రూ.20 లక్షల వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది.
జీవిత బీమా మెచ్యూరిటీ మొత్తం
జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) పాలసీ గడువు (మెచ్యూరిటీ) తీరినప్పుడు లేదా పాలసీదారుడు మధ్యలోనే చనిపోయినప్పుడు చెల్లించే మొత్తానికీ పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే ఇందుకోసం చెల్లించిన ప్రీమియం, పాలసీ కింద హామీ
ఇవీ చదవండి:
'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'
ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్