ఆంథ్రోపిక్‌తో టీసీఎస్ జట్టు
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:23 AM
అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీ ఆంథ్రోపిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ గురువారం ప్రకటించింది....
సంయుక్తంగా ఇండస్ట్రీ ఆధారిత ఏఐ సొల్యూషన్ల అభివృద్ధి
50,000 మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ మోడళ్ల యాక్సెస్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీ ఆంథ్రోపిక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ గురువారం ప్రకటించింది. తమ కస్టమర్లలో ఎంటర్‌ప్రైజ్ ఏఐ సేవల వినియోగాన్ని పెంచేందుకు ఈ భాగస్వామ్యం ద్వారా తోడ్పడనున్నట్లు టీసీఎస్ తెలిపింది. ఇందుకోసం ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, సేల్స్ సహా పలు విభాగాలకు చెందిన 50,000 మంది ఉద్యోగులకు ఆంథ్రోపిక్ కు చెందిన క్లాడ్ ఏఐ మోడళ్లపై శిక్షణనివ్వనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఆయా రంగాల పరిశ్రమలకు అవసరమైన ఏఐ పరిష్కారాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు టీసీఎస్ డెడికేటెడ్ బిజినెస్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఏఐ మోడళ్లు దేశీయ ఐటీ కంపెనీల సంప్రదాయ సేవలను భర్తీ చేస్తాయని, దాంతో మన ఐటీ సంస్థ ఆదాయం భారీగా తగ్గవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ కారణంగానే గత కొన్ని నెలలుగా మన ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. తత్ఫలితంగా రూ.6 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కూడా కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఆంథ్రోపిక్‌తో టీసీఎస్ జట్టు కట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కృత్రిమ మేధతో మరిన్ని ఉద్యోగాలు: మైక్రోసాఫ్ట్
ఏఐతో పోయే ఉద్యోగాల కంటే కొత్తగా పుట్టుకొచ్చే ఉద్యోగాలే ఎక్కువని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవల్‌పమెంట్ సెంటర్ ఎండీ, ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ అన్నారు. భారత ఇంజనీర్లు ఉద్యోగ భద్రతకు సంబంధించిన భయాలను వీడి ఈ సాంకేతికతలో నైపుణ్యం సాధించడంపై దృష్టిపెట్టాలన్నారు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..