రేపు టాటా సన్స్ బోర్డు సమావేశం
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:41 AM
టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు గురువారం సమావేశమవుతోంది. టాటా సన్స్ షేర్లను స్టాక్ ఎక్ఛేంజ్‌ల్లో లిస్టు చేయించాల్సిందే అన్న...
ముంబై: టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు గురువారం సమావేశమవుతోంది. టాటా సన్స్ షేర్లను స్టాక్ ఎక్ఛేంజ్‌ల్లో లిస్టు చేయించాల్సిందే అన్న ఆర్‌బీఐ ఆదేశాలు, ఎన్ చంద్రశేఖరన్ తర్వాత ఎవరిని టాటా సన్స్ చైర్మన్‌గా నియమించాలి? వంటివి ఈ సమావేశంలో ప్రముఖంగా చర్చకు రానున్నాయి. దీంతో ఈ సమావేశం హాట్‌హాట్‌గా జరుగుతుందని భావిస్తున్నారు.
కంపెనీపై హైకోర్టుకు ఆర్‌బీఐ..
టాటా సన్స్ వ్యవహారంలో ఆర్‌బీఐ ముందు జాగ్రత్త పడుతోంది. టాటా సన్స్ మిమ్మల్ని ఆశ్రయిస్తే.. మా వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దంటూ బాంబే హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. టాటా సన్స్ షేర్లను స్టాక్ ఎక్ఛేంజీల్లో లిస్టు చేయక తప్పదని ఆర్‌బీఐ ఇటీవల స్పష్టం చేసింది. అయితే టాటా ట్రస్టులు హైకోర్టుకు వెళ్లి తమ ఆదేశాలపై స్టే లేదా ఇతర ఉత్తర్వులు తెచ్చుకునే అవకాశం ఉందని ఆర్‌బీఐ భావిస్తోంది. అలాంటి పరిస్థితే వస్తే.. తమ వాదన వినకుండా టాటా సన్స్‌కు అనుకూలంగా ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరేందుకు ఆర్‌బీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News