విడతల వారీగా ‘టాటా’ కార్ల ధరల పెంపు!
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:01 AM
ముడి పదార్ధాల ధరలు నిరంతరం పెరుగుతుడడం మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిని అధిగమించేందుకు తమ కార్ల ధరలను విడతల వారీగా పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తెలిపింది.
న్యూఢిల్లీ: ముడి పదార్ధాల ధరలు నిరంతరం పెరుగుతుడడం మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిని అధిగమించేందుకు తమ కార్ల ధరలను విడతల వారీగా పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తెలిపింది. కమోడిటీ ధరల పెరుగుదల భారాన్ని కంపెనీ ఇప్పటికే భరిస్తోందని, ఒకేసారి వాహనాల ధరలను పెంచితే డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా ధరలను పెంచే అవకాశాలను ప్రతి నెలా సమీక్షిస్తున్నట్లు కంపెనీ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. సెప్టెంబరులో ఇప్పటికే ఒకసారి ధరలను పెంచామని.. తదుపరి ధరల పెంపు ఎప్పుడు ఉంటుందని ఇప్పుడే చెప్పలేమన్నారు.
మార్కెట్లోకి టాటా ఏరిస్ : టాటా మోటార్స్ శుక్రవారం మార్కెట్లోకి సరికొత్త కాంపాక్ట్ సెడాన్ ‘టాటా ఏరి్‌స’ను విడుదల చేసింది. వ్యక్తిగత కార్ల కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని ఈ కారును రెండు వేరియంట్లలో తీసుకువచ్చినట్లు శైలేష్ చంద్ర తెలిపారు. ఏరిస్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.29 లక్షలుగా ఉండగా సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది.