టాటా.. టాప్ బ్రాండ్
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:40 AM
దేశంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ మంగళవారం విడుదల చేసింది. టాటా గ్రూప్ వరుసగా పదో ఏడాదీ భారత టాప్ బ్రాండ్‌గా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది..
బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక
వరుసగా పదో ఏడాదీ అగ్రస్థానం
ఇన్ఫీ నం.2 .. ఎల్‌ఐసీకి థర్డ్ ప్లేస్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ మంగళవారం విడుదల చేసింది. టాటా గ్రూప్ వరుసగా పదో ఏడాదీ భారత టాప్ బ్రాండ్‌గా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. గడిచిన ఏడాది కాలంలో టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 7 శాతం పెరిగి 3,360 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.24 లక్షల కోట్లు) చేరుకుందని బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్టు వెల్లడించింది. కాగా, దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ 1,640 కోట్ల డాలర్ల (రూ.1.58 లక్షల కోట్లు) బ్రాండ్ వాల్యూతో వరుసగా ఐదో ఏడాదీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మూడో స్థానంలో నిలిచింది. సంస్థ బ్రాండ్ విలువ 12 శాతం పెరిగి 1,530 కోట్ల డాలర్లకు (రూ.1.47 లక్షల కోట్లు) చేరుకుంది. హెచ్‌డీఎ్‌ఫసీ గ్రూప్ (1,390 కోట్ల డాలర్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1,080 కోట్ల డాలర్లు) వరుసగా 4,5వ స్థానాలను దక్కించుకున్నాయి. తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, అదానీ గ్రూప్, ఎల్ అండ్ టీ, ఎయిర్‌టెల్ ఉన్నాయి.
దేశంలోని టాప్ 100 బ్రాండ్ల మొత్తం విలువ 25,280 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.24.34 లక్షల కోట్లు) చేరుకుంది. అంతర్జాతీయ సవాళ్ల నేపథ్యంలోనూ ఈ విలువ గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరిగింది.
114 శాతం విలువ పెరుగుదలతో 2026 జాబితాలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన బ్రాండ్‌గా సుజ్లాన్ ఎనర్జీ నిలిచింది.
93.5 స్కోర్‌తో పాటు ట్రిపుల్ ఏ ప్లస్ రేటింగ్‌తో తాజ్ హోటల్స్ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా వరుసగా ఐదో ఏడాదీ అగ్రస్థానంలో కొనసాగింది. జొమాటో, అమూల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
బ్రాండ్ విలువ అత్యంత వేగంగా పెరిగిన వ్యాపార గ్రూపుల్లో జేఎ్‌సడబ్ల్యూ అగ్రస్థానంలో ఉంది. అదానీ గ్రూప్ గత ఏడాది 13వ స్థానం నుంచి ఈసారి ఏకంగా టాప్ టెన్‌లోకి (8వ స్థానానికి) ఎగబాకింది.
టీసీఎస్ వరుసగా 14వ ఏడాదీ అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్‌గా నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి
తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు
రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!